Homeతెలంగాణహిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన సేవలు ఎనలేనివి

హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన సేవలు ఎనలేనివి

• మునుగోడులో సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
• మునుగోడులో హిందూ వాహిని ఆధ్వర్యములో ర్యాలీ

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై ఇరుగు రవి కుమార్ ,సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ , మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు. చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివని గుర్తుకు తెచ్చారు.. చత్రపతి శివాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలన్నారు. టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్ హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు…పాల్వాయి చెన్నారెడ్డి,వేదాంతం గోపీనాథ్, బొడ్డు నాగరాజు గౌడ్,అనంత లింగస్వామి మాదగోని నరేందర్ గౌడ్, బొమ్మిడికాయల సాయి, పోలే రాజు,బి కళ్యాణ్, నీరుడు రవివర్మ,వేముల సాయి, హిందువాహిని కమిటీ సభ్యులు ,యువత పాల్గొన్నారు.

Gorakhpur Cataract Surgery Tragedy: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది కళ్లు తీసేశారు!

Mother’s Surname: పిల్లలకు తండ్రి ఇంటిపేరే ఉండాలా?, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments