Homeతెలంగాణశివాజీ మహారాజ్ జయంతిని శాంతియుతంగా నిర్వ‌హించాలి

శివాజీ మహారాజ్ జయంతిని శాంతియుతంగా నిర్వ‌హించాలి

  • డీజేల‌కు అనుమ‌తి లేదు
  • ర్యాలీ, కార్య‌క్ర‌మాకు పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • ఎస్పీ డి.జానకి

మహబూబ్ నగర్, క్రైమ్ మిర్ర‌ర్‌: ప‌ట్ట‌ణంలో ఛ‌త్ర‌ప‌తి శివాజీమ‌హారాజ్ జ‌యంతిని నాయ‌కులు, ప్ర‌జ‌లు శాంతియుత వాతావ‌ర‌ణంలోనిర్వ‌హించుకోవాల‌ని జిల్లా ఎస్పీ డి.జాన‌కి అన్నారు. జ‌యంతి సంద‌ర్భంగా ర్యాలీలు, కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌నుకున్న ముందుగా పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని సూచించారు.

ర్యాలీ కార్య‌క్ర‌మాలు పోలీసులు సూచించిన మార్గాల్లోనే నిర్వ‌హించాల‌ని తెలిపారు. ట్రాఫిక్కు అంత‌రాయం క‌లుగ‌కుండా నిర్వ‌హించాల‌ని, డీజే సౌండ్‌లు పూర్తిగా నిషేధమ‌ని తెలిపారు. అశాంతి, ఉద్రిక‌త్త‌లు క‌లిగేలా నినాదాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు.

పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు, వృద్దుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా నిర్వ‌హించుకోవాల‌న్నారు. ఎవ‌రైన అనుమానాస్పదంగా, ఏదైన వ‌స్త‌వులు క‌నిపించిన వెంట‌నేపోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. మ‌ద్యం సేవించి ర్యాలీలో పాల్గొన‌డం పూర్తిగా నిషేధమ‌న్నారు.

అత్య‌వ‌స‌ర రాక‌పోక‌ల‌కు మార్గం ఖాళీగా ఉంచాల‌ని తెలిపారు. ఎవ‌రైన పై విష‌యాలు ఉల్లంఘించిన‌, ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగించిన‌, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించిన చ‌ట్ట‌రీత్య చ‌ర్య‌లు తీసుకొని కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

 

Most Popular

Recent Comments