- ఒకరు మృతి
మేడ్చల్, క్రైమ్ మిర్రర్: మేడ్చల్ జిల్లా జీనమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీద్ పూర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం క్రేన్, టాటా ఏస్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
కాగా ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి స్థానికులు, పోలీసులు సహాయంతో సమీప ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.









