
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారతదేశ క్రికెట్ టీం లో ఎంతోమంది ఆటగాళ్లు వాళ్ల యొక్క టాలెంట్ తో నేడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ తరంలో అలాంటి వారిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలాగే రిషబ్ పంత్ లాంటి ప్రముఖ క్రికెటర్ల పేర్లు వినపడుతుంటాయి. అయితే వీళ్ళందరిలో రిషబ్ పంత్ పేరు మాత్రం వేరు. ఎందుకంటే ఇతను ఇండియా కి కెప్టెన్ కాదు.. కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిషబ్ పంత్ అంటే ఇష్టమే. తను ఆడే ఆట తీరు, ప్రేక్షకుల్లో నింపే ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. కానీ ఇలాంటి రిషబ్ పంత్ నేడు వరుస గాయాల పాలు అవుతూ ఉన్నారు. ఇంగ్లాండ్ మరియు ఇండియాతో జరుగుతున్నటువంటి మూడు అలాగే నాలుగువ టెస్టులలో రిషబ్ పంత్ గాయాల పాలయ్యారు. మూడవ టెస్ట్ మ్యాచ్లో చేతి వేలికి గాయం అయినా కూడా కోలుకొని వచ్చారు… నాలుగోవ టెస్టు మ్యాచ్లో కాలికి గాయమైంది. కానీ ఈ గాయం చాలా పెద్దగా అనిపించి రిటైర్డ్ హర్టుగా మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
కాక గతంలోనూ.. అనగా దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు అతను కోల్పోవడానికి చాలా రోజులే పెట్టింది. ఆ సమయంలో రిషబ్ పంత్ దాదాపు మూడు నెలల పాటుగా బ్రష్ కూడా చేసుకోలేదు. కాలు తీసి మరోచోట పెట్టాలంటే సాధ్యమయ్యేది కాదు. అలా రిషబ్ పంతు నడవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దాని తర్వాత కోలుకొని వచ్చి మళ్లీ క్రికెట్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. కానీ రిషబ్ పంత్ మాత్రం ప్రతి మ్యాచ్లో అనవసరపు షాట్లు గాయాల పాలవుతున్నారు. ప్రతి సిరీస్ లోనూ ఏదో ఒక రకంగా రిషబ్ పంత్ గాయపడుతున్నాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా అతని కెరీర్ పై ఆలోచిస్తున్నారు. క్రికెట్లో రిషబ్ పంత్ ఎంత విలువైన ఆటగాడు మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి ఆటగాడు గాయాలు పాలు కాకూడదని రిషబ్ పంత్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరోసారి గాయాలు కాకుండా చూసుకోవాలని… క్రికెట్ అభిమానులు అలాగే క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా సలహాలు ఇస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో క్రికెట్ కెరీర్ నాశనం అవుతుందని అంటున్నారు.