- వడ్డేపల్లి మున్సిపాలిటీ జాగృతి కైవసం
- ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్‌తో పోటీచేసి విజయం
- కల్వకుంట్ల ఖాతాలో ఒక మున్సిపల్
గద్వాల, క్రైమ్ మిర్రర్: తెలంగాణలోని మున్సిపాలిటీ ఫలితాల్లో సంచలనం నమోదయ్యింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 8 వార్డులు గెలుచుకొని ఒక మున్సిపాలిటిన తన ఖాతాలోవేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత పార్టీ అయిన తెలంగాణ జాగృతి కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతి పార్టీ అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ పై పోటీ చేసిన విషయం తెలిసిందే. జాగృతి పార్టీ నేత వాడేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ సింబల్‌తో పోటీ చేసి విజయం సాధించారు.
మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా. కవిత జాగృతి పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు చెరో వార్డులో విజయం సాధించారు. ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేసిన కీలక అభ్యర్థి శ్రీను గత నెల రోజుల కింద మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత వెంట ఉన్నారు. ఆమెతో కలిసి పని చేశారు. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. బీఆర్‌ఎస్ పార్టీలో విభేధాల అనంతరం పార్టీ కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విభేధాల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కవిత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యర్థుల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి.









