క్రైమ్జాతీయం

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలనం.. డా. షాహీన్ అరెస్ట్!

ఢిల్లీ, క్రైమ్ మిర్రర్:- ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపగా, ఈ కేసులో అరెస్టైన మహిళ డా. షాహీన్ ఫోటో బయటకు వచ్చింది. నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలు నిర్వహించిన విచారణలో పలు సంచలన వివరాలు వెలుగుచూశాయి. ఈ వివరాల ప్రకారం, హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించిందని అధికారులు వెల్లడించారు. ఆమె ఉగ్రవాద ఆపరేషన్లకు నిధులు సమకూర్చడం, ఆపరేషన్లను సులభతరం చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆధారాలు లభించాయి.

Read also : అర్ధరాత్రి క్షమాపణలు చెప్పిన మంత్రి.. మరి కేసు వెనక్కి తీసుకుంటారా?

ఇంకా షాహీన్ జైషే మహ్మద్ తరఫున మహిళా రిక్రూట్‌మెంట్ (భర్తీ) ప్రక్రియను పర్యవేక్షిస్తూ, సోషల్ మీడియా ద్వారా యువతులను మతపరమైన భావోద్వేగాలతో ప్రేరేపించి ఉగ్రవాద దిశగా నడిపించిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటికే షాహీన్ ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ రికార్డులను స్వాధీనం చేసుకుని లోతైన విచారణ చేపట్టారు. దేశ వ్యాప్తంగా ఈ అరెస్టు చర్చనీయాంశమవుతుండగా, అల్ ఫలాహ్ యూనివర్సిటీ అధికారులు కూడా ఆమెపై అంతర్గత విచారణ ప్రారంభించారు. దేశ భద్రతను కదిలించిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Read also : నిన్న ధర్మేంద్ర.. నేడు గోవింద.. వరుసుగా కుప్పకూలిపోతున్న బాలీవుడ్ సీనియర్ నటులు!

Back to top button