తెలంగాణ

తొర్రూరులో చెత్త ట్రాక్టర్లకు 7గురు ఎస్సైలతో భద్రత

ఏడుగురు ఎస్సైలు ఎస్కార్టుగా వచ్చారు.. ఏడుగురు ఎస్సైలకు తోడుగా మరో 70 మంది పోలీసులు భద్రతలో ఉన్నారు. ఇంత బందోస్తు ఉందంటే అక్కడి ముఖ్యమంత్రే.. కేంద్రమంత్రే వచ్చారనుకుంటున్నారా.. కాదు ఇంత మంది పోలీసుల భద్రతగా ఉన్నది ఒక చెత్త ట్రాక్టరుకు. అవును మీరు చదివింది నిజమే. చెత్త ట్రాక్టర్ గా ఎస్కార్టుగా ఏడుగురు ఎస్సైలు, 70 మంది పోలీసులు వచ్చారు. ఇది చూసి స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. పట్టణ పరిధిలో సేకరించే చెత్తను అంగడిలో పోసేవారు.. ఆ అంగడి చెత్త మొత్తం నిండిపోవడంతో హచ్చు తండా దగ్గర పోస్తున్నారు. చెత్త దుర్వాసనతో రోగాలు వస్తున్నాయని చెత్తను తమ తండాలో పోయోద్దని, డంపింగ్ యార్డును తరలించాలని తండా వాసులు అడ్డుకున్నారు.కొన్ని రోజులుగా చెత్తను అక్కడ పోయకుండా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుంటున్నారు.

గిరిజనుల ఆందోళనతో చెత్త పోయడం కోసం పోలీసులను ఆశ్రయించారు తొర్రూరు మున్సిపల్ అధికారులు. దీంతో చెత్త ట్రాక్టర్లతో చెత్త పోయించే పనిని దిగారు తొర్రూరు పోలీసులు. చెత్త పోయకుండా అడ్డుకున్న హచ్చు తండా గిరిజనులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు.అనంతరం
తొర్రూరు మున్సిపాలిటీ అధికారులు 7గురు ఎస్సైలు, 70 మంది పోలీసు సిబ్బందితో కలిసి భారీ బందోబస్తుతో చెత్త ట్రాక్టర్లను డంపింగ్ యార్డుకు తరలించారు. చెత్తకు ఇంత భారీ ఎస్కార్ట్ ఏంటని, మేము ఏం నేరం చేశామని పోలీసులు అరెస్ట్ చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button