యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల కొడుకును సొంత తల్లే కిరాతకంగా హత్య చేసింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో పెద్దరావులపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నయం కాకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో తాను చనిపోవాలని నిర్ణయించుకున్న సోని కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే తన కొడుకు అనాథగా మారుతాడనే భయంతో ముందు కొడుకును చంపేసింది. చిన్న కొడుకు శ్రేయాన్న్ కు ఉరివేసి హత్య చేసింది. అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
5,555 Less than a minute