
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- రాబోయే ఫిబ్రవరి నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ దాదాపు వైదొలగిందని చెప్పవచ్చు. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమణ దాదాపు ఖరారు కావడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ పూర్తిగా t20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఫోటోలు చేర్చే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని ఉన్నా కూడా ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని దూరంగా ఉంటున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన వెస్టిండీస్ తో కోల్కత్తా వేదికగా జరగబోయేటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడుల కారణంగా భారత్ లోని ప్రతి ఒక్కరు కూడా ఆదేశంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.
Read also : నా డైలాగ్ పై పిల్లలు చేత రీల్స్ చేయించొద్దు : అనిల్ రావుపూడి
Read also : రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ చేయాలి : మాజీ క్రికెటర్





