
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ఆఫ్రికా మధ్య నిన్న మొదటి టి20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని కూడా పొందింది. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా సంజు శాంసన్ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గిల్ కు టీం మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది అని.. ఈ నేపథ్యంలోనే సంజు సాంసన్ కు అవకాశాలు కల్పించట్లేదు అని మండిపడుతున్నారు. మొదటి టీ20లో సంజు శాంసన్ కు చోటు దక్కకపోవడంపై ఇప్పటికే సంజు అభిమానులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం కూడా గిల్ కంటే సంజునే బెటర్ అంటూ కామెంట్లు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అందుకు తగ్గట్లు సంజు అభిమానులు ఆధారాలు కూడా చూపించడం గమనార్హం.
Read also : ఆ జలపాతం వైపు ఎవరూ వెళ్లొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు అటవీశాఖ సూచన!
సౌత్ ఆఫ్రికా తో జరిగిన గత టి20 సిరీస్ లో సంజూ రెండు సూపర్ సెంచరీలు చేశారు అని… యావరేజ్ లేదా స్ట్రైక్ రేటు రెండు చూసుకున్న గిల్ కంటే సంజూ నే బెటర్ అంటూ అభిమానులు గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా టీం మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గాయం నుంచి కోలుకొని వచ్చినటువంటి గిల్ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో నాలుగు పరుగులకే అవుట్ అయిన విషయం తెలిసిందే. సంజు సాంసన్ కు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా టీ20 జట్టులో ప్లేయింగ్ లెవెన్ లో ఉండడానికి అర్హుడు అని తెలియజేస్తున్నారు. టీమ్ మేనేజ్మెంట్ కావాలనే సంజు సాంసన్ ను పక్కనపెట్టి గిల్కు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఇది చాలా అన్యాయం అని కూడా పేర్కొంటున్నారు. అయితే మరోవైపు గిల్ ఫ్యూచర్ కెప్టెన్ కాబట్టి తనకి ఎక్కువగా అవకాశాలు పక్కాగా ఉంటాయని తనకు మద్దతుగా నిలుస్తున్నారు.
Read also : Justice GR Swaminathan: ఆలయానికి అనుకూలంగా తీర్పు, హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పెట్టిన విపక్ష ఎంపీలు!





