Tuesday, March 24, 2026
Homeతెలంగాణసమ్మక్క సారలమ్మ హుండీ లెక్కింపు..

సమ్మక్క సారలమ్మ హుండీ లెక్కింపు..

తొలి రోజు రూ.2.49 కోట్ల ఆదాయం

ములుగు,క్రైం మిర్ర‌ర్ : స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాత‌ర‌కు సంబందించి తొలి రోజు 125 హుండీల‌ను లెక్కించారు . 125 హుండీల లెక్కింపులో రూ.2,49,65,000 నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులకోర్కెలు తీర్చే కొంగు బంగార‌మైన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ల‌కు న‌గ‌దు రూపంలో కానుక‌లు స‌మ‌ర్పించారు. దీంతో ఆదాయం ఎక్కువ‌గానే పెరిగింది. ఈ హుండీ లెక్కింపు అంతా దేవ‌దాయ‌శాఖ‌,సేవాస‌మితి ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగుతుంద‌ని తెలిపారు. న‌గ‌దుతో పాటు భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారు,

వెండి కానుక‌ల‌ను వేరు చేశారు. లెక్కింపు పూర్త‌యిన బంగారం, వెండి, ఇనుప హుండీల్లో భ‌ద్ర‌ప‌ర‌చి తాళాలువేసి భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. రానున్న‌రోజుల్లో ఇదే విధంగా మిగిలిన‌ హుండీ లెక్కింపు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments