తెలంగాణ

రన్ ఫర్ యూనిటీ… ఐక్యమత్యమే మహాబలం

మాదాపూర్, క్రైమ్ మిర్రర్:- సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివస్‌లో భాగంగా శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ వద్ద రన్ ఫర్ యూనిటీ పేరిట నిర్వహించిన 2కే రన్‌ను మాదాపూర్ డీసీపీ రితీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐక్యమత్యమే మహా బలమన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవలన్నారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో సాగిన ఈ రన్‌లో ఔత్సాహికులు 600ల మంది పాల్గొనగా, మాదాపూర్ జోన్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Read also : చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో..ఐదుగురికి ఉరిశిక్ష

Read also : చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం

Read also : మునుగోడులో పోలీస్ శాఖ ఆధ్వర్యములో రన్ ఫర్ యూనిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button