![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-95.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా కి గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా గాయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కి రెండు రోజులు ఆస్పత్రిలో స్కానింగ్ జరగాల్సి ఉందని తెలిపారు. ఆ స్కానింగ్ లో వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఇంగ్లాండ్ తో జరగబోయే మూడో వన్డే మరియు ఆ తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడంపై క్లారిటీ ఇస్తామని ప్రెస్మీట్లో రోహిత్ శర్మ తెలిపారు.
నల్గొండ జిల్లాలో తాగునీటి కష్టాలు.. కేసీఆరే రావాలంటున్న జనాలు
కాగా వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCA లో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ తో ఓడి సిరీస్ కు అతను స్థానంలో తాజాగా బీసీసీఐ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసింది. ఇవాళ ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా మొదటి ఓడి మ్యాచ్ ఆడనుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ…