
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నెంబర్ వన్ -1 స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగినటువంటి ఆస్ట్రేలియా తో మూడు వన్డే ల సిరీస్ లో భాగంగా రెండు వన్డేలలో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫస్ట్ వన్డేలో చాలా తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా.. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇక మూడవ వన్డేలో సూపర్ సెంచరీ చేసి రికార్డుల మీద రికార్డులను సృష్టించారు. 30 ఏళ్ల కిందట రోహిత్ శర్మ వేరు.. 30 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ రికార్డ్స్ వేరు. ఈ హిట్ మ్యాన్ ఆస్ట్రేలియా సిరీస్ లో మొత్తంగా 202 పరుగులు చేశాడు. దీని ద్వారానే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం కి వెళ్ళినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అక్టోబర్ 29వ తేదీన ఐసీసీ అధికారికంగా ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవైపు ఇండియన్ ఓపినర్, యంగ్ ప్లేయర్ గిల్ 768 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక రెండవ స్థానంలో 764 పాయింట్లతో జర్దాన్ ఉన్నారు. కాగా మూడవ వన్డే మ్యాచ్లో భాగంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఇప్పటినుంచి బీసీసీఐకు వీరిద్దరి ఫ్యాన్స్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. త్వరలో సౌత్ ఆఫ్రికా తో మరొక వన్డే సిరీస్ లో భాగంగా వీరిద్దరు రాణిస్తే పక్కాగా అప్పటికల్లా ఫిట్గా ఉంటే మాత్రం వీరిద్దరిని సెలెక్ట్ చేయవచ్చు అని ఇప్పటికే కొంతమంది క్రికెట్ నిపుణులు తెలిపారు.
Read also : ప్రస్తుతం పాత్రధారులు అరెస్టు అవుతున్నారు… త్వరలోనే జగన్ కూడా : మంత్రి సత్య కుమార్
Read also : <a style="color:red"
href=”https://crimemirror.com/30000-people-deceived-by-investments-indian-cybercrime-sensational-stories/”>ఇన్వెస్ట్మెంట్స్ నమ్మి మోసపోయిన 30 వేలమంది… ఇండియన్ సైబర్ క్రైమ్ సంచలన విషయాలు?





