•ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా?
•రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
•రైతు సంఘం,సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తుక్కాపురం స్టేజి నుండి రహీంఖాన్ పేట ఖప్రాయ పల్లి, మోత్కూరు వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం రోజున ఆత్మకూరు(ఎం) మండలంలోని తుక్కాపురం ఖప్రాయపల్లి మధ్యన రోడ్డు నిర్మాణం మధ్యలో వదిలేసి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు మంజూరు కాగా గత మూడు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం పనులు నత్త నడకన సాగుతోందని ఇప్పటికే ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. ఈ మార్గంలో ప్రమాదానికి గురై పోతిరెడ్డిపల్లికి చెందిన మక్తల నవీను ప్రాణాలు కోల్పోయాడని, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించిన ప్రయాణికులకు కాళ్లు చేతులు విరిగాయని ఈ ప్రాంతం గుండా వందలాది వాహనాలు, ప్రయాణికులు వాహనదారులు ప్రయాణిస్తున్నారని కానీ బస్సుల్లో వాహనాల్లో ప్రయాణించడంలో కుదుపులకు అనేకమందికి నడుములు పట్టేసి గాయాలపాలవుతున్నారని,నరక కూపంగా మారిన తుక్కాపురం స్టేజి నుండి రహీం ఖాన్ పేట వరకు రోడ్డు అతుకుల గతుకులతో గుంతల మయంగా మారిందన్నారు.అదేవిధంగా వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తక్షణమే పట్టించుకోని రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుక్కాపురం స్టేజి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం, రైతు సంఘం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ రెడ్డి,మహేష్,కే రాము కుమార్,ఏ వెంకన్న,బుగ్గ రాములు, శ్రీశైలం, సత్తయ్య ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు పాల్గొని రాస్తారోకోని నిర్వహించారు.
స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్ ఏర్పాటు చేశాలి : మాజీ జెడ్పీటీసీ
