Homeఆంధ్ర ప్రదేశ్పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు

పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు

  • మార్చి, ఏప్రిల్‌లోనే 48 డిగ్రీలు 
  • మే నెలల్లోఅయితే మంటలే..

కర్నూలు, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది.అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండ‌గా పగటి వేళ ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్టానికి చేరుకున్నాయి. కొంచెం తెల్లవారు జామున మాత్రమే చలి కనిపిస్తుంది.

మిగిలిన అన్ని వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ అందించిన నివేదికల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కొన్నిచోట్ల తేలికపాటి, మరొకొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆ తర్వాత మాత్రం మరింత ఎండలు తీవ్రమవుతాయని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశముంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు నేడు కూడా 35 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా మార్చి నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎండలు దంచి కొడతాయని అంటున్నారు. ఈసారి ఏపీలో నలభై ఎనిమిది డిగ్రీలు మార్చి, ఏప్రిల్ నెలలోనే టచ్ అవుతాయని అంటున్నారు. ఇక మే నెలలో ఎండల తీవ్రత ఎంతగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.

వర్షాలు పడిన తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని వాతావావ‌ర‌ణ శాఖ తెలిపింది. మరొకవైపు తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

హైద‌రాబాద్‌లో ప‌గ‌టిఉష్ణోగ్ర‌త‌లు 30డిగ్రీలు న‌మోదు….
తెలంగాణ వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపిన ప్ర‌కారం ఈసారి అధికంగా ఎండల తీవ్రత ఉంటుందని, అయితే ఈ నెలాఖరులో వానలు పడే అవకాశముందని తెలిపారు.

నేడు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, హైదరాబాద్ నగరంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతున్నాయ‌ని తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాత్రి వేళ మాత్రం కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల‌ 22, 23, 24 తేదీల్లో తెలంగాణ అంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 20-40 మి.మీ వరకు మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన జిల్లాల్లో వర్షం, వడగళ్ల వాన కురుస్తుందని తెలిపారు

Most Popular

Recent Comments