లగచెర్లలో జరిగిన కలెక్టర్ పై దాడి ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలే కుట్ర పూరితంగా రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. భూములు గుంజుకుంటున్నారనే కసితో బాధితులు దాడి చేస్తే బీఆర్ఎస్ కు ఏం సంబంధమని గులాబీ నేతలు కౌంటరిస్తున్నారు. ఇక లగచెర్ల కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న 18 మంది రైతులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్ తో కలిసి సంగారెడ్డి జైలుకు వెళ్లిన కేటీఆర్.. బాధిత రైతులతో మాట్లాడారు. లగచెర్లలో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
రైతులతో ములాఖత్ తర్వాత మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందని చెప్పారు. పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని.. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి యే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడని కేటీఆర్ ప్రశ్నించారు.
జైల్లో ఉన్న బాధితుల బాధ చెప్పలేని విధంగా ఉందన్నారు కేటీఆర్. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని.. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడని తీసుకెళ్లారని విమర్శించారు. వనపర్తిలో చదువుకుంటున్నాడని.. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారని తెలిపారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారన్నారు.
దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్ లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడని వెల్లడించారు.
ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్ లో రాజ్యంగేతర శక్తి గా మారాడని కేటీఆర్ ఆరోపించారు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కొడంగల్ లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట.. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని స్థానిక ప్రజలు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు.. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు.. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు గుర్తించి 21 మందిని మాత్రమే చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారని.. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారని తెలిపారు.
దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వాళ్ల చేతగాని తనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారని మండిపడ్డారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని..వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు వారిని చిత్ర హింసలు పెట్టారని.. మూడు మూడు గంటల పాటు కొట్టారని కేటీఆర్ ఆరోపించారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తాగి బూతులు మాట్లాడుతూ ప్రజలపై దాడులు కూడా చేశారని చెప్పారు.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?