
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్ చివరికి విరమించబడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రెండు పక్షాలూ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే రూ.600 కోట్లు విడుదల చేయడానికి సిద్ధమని ప్రకటించగా, మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చింది. గతంలో కూడా రూ.600 కోట్లు బకాయిలుగా చెల్లించిన విషయం తెలిసిందే.
Also Read : పత్తి దళారుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లో ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ వంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు తిరిగి యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఈనెల 3వ తేదీ నుంచి కొనసాగుతున్న బంద్ కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, చర్చలు సఫలమవడంతో వారికి ఊరట లభించింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వ హామీతో తమ ఆర్థిక ఒత్తిడి కొంత మేరకు తగ్గిందని పేర్కొన్నాయి. ఈ పరిణామంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
Read More :
-
సారా తాగితే సరసానికి పనికిరాడు.. వోడ్కా వల్ల గవదులు వాచిపోతాయి!
-
మరో మతాన్ని కించపరచను.. తలైన నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను : బండి సంజయ్
-
కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అంట.. మరి హిందువులకు గౌరవం లేదా : కిషన్ రెడ్డి
-
యువతే కదా ఏం చేస్తారు అనుకోకండి.. తలచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి : వైయస్ జగన్





