తెలంగాణ
Trending

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం…!

చండూరు, క్రైమ్ మిర్రర్:- మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తుందని అనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిధులు రావాల్సిన అవసరం ఉండడంతో ప్రభుత్వం ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ దిశగా అధికారులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. వార్డుల విభజన ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేపడితే ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వార్డుల పునర్విభజన లేకపోతే జనవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓటర్ల సంఖ్య కూడా పెరగనుంది. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి వీటిలో పునర్విభజన లేకపోతే రిజర్వేషన్లు కూడా మార్పు ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఏదేమైనా మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం రావడంతో… నాయకుల్లో, కార్యకర్తల్లో సందడి మొదలైంది. ఆయా పార్టీల నాయకులు ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలని ఎవరికి వారే చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆశావాహులు కూడా వారి వారి వార్డుల్లో ఎలా ముందుకు వెళ్లాలని అప్పుడే సమాలోచన చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నట్లుగా తెలుస్తుంది.

Read also : భారీ సెక్యూరిటీతో అదే లుక్ లో మరోసారి ఈవెంట్ లో మెరిసిన నిధి అగర్వాల్?

Read also : ఆ విషయం తెలియకనే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు : డార్లింగ్ ప్రభాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button