
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందన ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ తన కాబోయే భార్య రష్మిక మందన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను సినిమాలలో ఎలా దూసుకుపోతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అన్నారు.. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయమని.. దీనిని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని హీరో విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. రష్మిక జర్నీ చూస్తే చాలా గర్వంగా ఉంది… నిజజీవితంలోనూ ఆమె భూమాదేవినే అని.. సినిమా ఇండస్ట్రీలో అయినా లేదా బయట అయినా సరే ఎవరిని మాటలు అన్నా.. వేరే ఫేక్ వార్తలు సృష్టించిన కూడా తను అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది అని ప్రశంసించారు. ఇంతటి ఓపిక, మంచితనం రష్మికు ఉండటం చాలా సందర్భాల్లో గమనించాను అని అన్నారు. కాగా వీరిద్దరూ ఎన్నో రోజులుగా డేటింగ్ లో ఉన్న విషయం.. అవి ఆ నోట ఈ నోట పడి చివరికి ఎలా గొల ఒకటి అవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు.
Read also : ఈ నెల 17న మరో అల్పపీడనం.. దంచికొట్టనున్న భారీ వర్షాలు!
Read also : Business: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు





