
నల్గొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాపోలు యాదగిరి ప్రచారాన్ని మరింత దూకుడు కొనసాగిస్తున్నారు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో, గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న యాదగిరి, ఆదివారం శివన్నగూడ గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి, ప్రచారంతో పాటు గల్లీలలోని పేరుకుపోయిన సమస్యలను గమనించారు.. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. వార్డుల వారిగా గ్రామ ప్రజలను కలిసి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని, పదవి లేకున్నా ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఆయనకు ప్రజలల్లో ఆదరణ పెరుగుతుంది.. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు, ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని యాదగిరి అన్నారు. యాదగిరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘బ్యాట్’ గుర్తును, గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా ప్రజలను కోరారు.
అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధిపరమైన హామీలతో ముందుకు సాగుతున్న యాదగిరి, ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, గ్రామంలో వేదికను ఏర్పాటు చేసి, నేరుగా సమస్యలపై స్పందించనున్నారు.





