
కింజరాపు రామ్మోహన్‌నాయుడు… ఎర్రన్నాయుడు కుమారుడు. వారసురుడి టీడీపీలో ఎంట్రీ ఇచ్చినా… తనదైన ముద్రవేసి అంచలంచెలుగా ఎదురుగుతున్నారు. రాజకీయాల్లోకి ఎంతో మంది వారసులు వస్తుంటారు. కానీ.. విజయం మాత్రం కొందరినే వరిస్తుంది. ఈ కొందరిలో ఒక్కడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు. మూడు పదుల వయస్సులో ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు కేంద్రమంత్రి స్థాయికి వెళ్లారు. మొదటి నుంచి టీడీపీకి అండగా నిలిచారు.. నిలుస్తున్నారు రామ్మోహన్‌నాయుడు. లోకేష్ టీమ్‌లో నెంబర్-2 స్థానానికి చేరారు. పార్టీలో లోకేష్ తర్వాత అంతా ఆయనే అంటూ పార్టీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి.
2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి గెలిచారు రామ్మోహన్‌నాయుడు. 2019లో వైసీపీ హవా ఉన్నా తట్టుకుని నిలబడ్డాడు. రెండో సారి ఎంపీగా గెలిచి చూపించాడు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయినా.. ఎంపీగా జయకేతనం ఎగురవేశాడు రామ్మోహన్‌నాయుడు. 2024 ఎన్నికల్లో మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిచి హాట్రిక్ ఎంపీగా రికార్డ్ సృష్టించాడు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థానం ఆయన వారసుడు నారా లోకేష్‌దే. ఈ విషయంలో అందరికీ తెలుసు. అయితే… లోకేష్ తర్వాత ఎవరు అంటే మాత్రం… రామ్మోహన్‌నాయుడు పేరే వినిపిస్తోంది. అమరావతి పునర్‌నిర్మాణం సందర్భంగా నిర్వహించిన సభలోనూ.. రామ్మోహన్‌నాయుడు ప్రాధాన్యత ఇచ్చారు. మోడీ ప్రసంగాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి వినిపించింది రామ్మోహన్‌నాయుడే. అంటే… ఆయనకు పార్టీలో ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లోకేష్ తర్వాత స్థానం రామ్మోహన్‌నాయుడిదే… లోకేష్‌కు అండగా ఉంటూ.. అన్నీ తానై చక్కబెడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడే కాదు… రానున్న రోజుల్లోనూ… రామ్మోహన్ నాయుడి భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉంటుంది… టీడీపీలో ఆయన టాప్ పొజిషన్‌లో ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో ఆశ్చర్యం లేదనుకోండి.