
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-రామకృష్ణాపూర్ ఎస్సై గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జె. శ్రీధర్ కు శుక్రవారం రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎస్ఐ శ్రీధర్ తో ప్రెస్ క్లబ్ సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నేరాల నియంత్రణలోనూ ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడంలోనూ మీడియా పాత్ర కీలకమన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రెస్ క్లబ్ సభ్యుల మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి, శాంతియుత వాతావరణానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్ఐకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మిట్టపల్లి సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీ ఎరుకల బుచ్చిబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎర్రవల్లి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేల్పుల కిరణ్, సభ్యులు బద్రి సంతోష్ కుమార్ గంజి సతీష్ పిల్లి రవి కిరణ్ పాల్గొన్నారు.
Read also : తల్లి చేతులో ఉన్న బిడ్డను లాక్కెళ్లి బావిలో పడేసిన కోతి.. రక్షించిన డైపర్!
Read also : ప్రియురాలు దూరం పెట్టిందని.. ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు





