Monday, February 23, 2026
Homeజాతీయంబస్తర్ లో రైల్వే పరుగులు.. కేంద్రం కీలక నిర్ణయం!

బస్తర్ లో రైల్వే పరుగులు.. కేంద్రం కీలక నిర్ణయం!

Bastar Railway Line: నక్సల్ ప్రభావిత ప్రాంతమైన చత్తీస్ గఢ్ బస్తర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే బస్తర్ ప్రాంతంలో రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు కొనసాగించేలా చర్యలు చేపడుతోంది. తెలంగాణలోని కొత్తగూడెం, చత్తీస్ గఢ్ లోని కిరందుల్ ను కలుపుతూ 160 కిలో మీటర్ల మేర రైల్వే నిర్మాణానికి లొకేషన్ సర్వే జరుపగుతోంది. త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుంది. తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైను ఎక్కువగా చత్తీస్ గఢ్ ప్రాంతంలోనే ఉంటుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 138 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. నక్స్ ల్ ప్రభావిత బస్తర్ డివిజన్ లోని సుక్మా, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల మీదుగా ఈ రైల్వే లైన్ కొనసాగనుంది.

ఈ రైల్వే లైన్ తో లాభాలేంటి?

చత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతం పూర్తిగా ఆదివాసీలతో ఉంటుంది. నగర జీవితానికి ఈ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే, ఆదివాసీ, గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అత్యాధునిక లైడార్‌ టెక్నాలజీతో ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. సర్వే కంప్లీట్ అయిన తర్వాత రైల్వే విభాగం.. డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తుంది.  దానికి ఆమోదం లభించిన వెంటనే రైల్వే లైన్ నిర్మాణ పనులు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అన్ని పనులు చకచకా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also: ఇక బైకులకూ టోల్ ఛార్జీ.. నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments