తగ్గిన బంగారం, వెండి ధరలు, ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?

0
185
Gold and Silver Rates Today June 28th 2025
Gold and Silver Rates Today June 28th 2025

Gold Rates: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. సుమారు రూ. 1000 తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండికి డిమాండ్ తగ్గడం మూలంగానే ధరలు తగ్గినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 930 తగ్గి రూ. 98,010కి చేరింది. 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 89,840కి చేరింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు

వెండి ధరల విషయానికి వస్తే.. స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర జస్ట్ రూ.100 తగ్గింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,07,800కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నైలో రూ. 1,17,800గా ఉంది. ముంబై, పూణే, వడోదర, బెంగళూరు, పాట్నా, సూరత్, మైసూర్, నాగ్  పూర్ ‎లో కిలో వెండి  ధర రూ.1,07,800గా పలుకుతోంది.

బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గాయంటే?

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి కొనుగోళ్ల పట్ల డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్ పైగా పడింది. అటు అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి విలువ పెరగడం కూడా బంగారం డిమాండ్ ను తగ్గించింది. అటు ఫెడరల్ రిజర్వ్ పాలసీ, అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు కూడా వీటి ధరలపై ప్రభావాన్ని చూపాయని నిపుణులు వెల్లడించారు. అయితే, వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ, గోల్డ్, సిల్వర్ మీద పెట్టుబడులు సేఫ్ అంటున్నారు నిపుణులు.

Read Also: ఇక బైకులకూ టోల్ ఛార్జీ.. నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?