తెలంగాణ

అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్.. తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్!

ఐకాన్ స్టార్,పుష్ప హీరో అల్లు అర్జున్‌ చుట్టూ మరింతగా ఉచ్చుబిగుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇవాళ మరోసారి చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు విచారణకు మంగళవారం ఉదయం 11 రావాల్సిందిగా నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనతో పాటు అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం పట్లు పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆ దిశగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు పోలీసుల తదుపరి చర్యలపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్‌ను మళ్లీ విచారణకు పిలిపిస్తే ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.

పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంట్లో కీలక సమావేశం జరుగింది. తమ లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యి చర్చించారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. విచారణలో పోలీసుల అడగబోయే ప్రశ్నలపై చర్చించారు. తమ లీగల్ టీమ్‌ నుంచి లీగల్ ఒపీనియన్‌ను అల్లు అర్జున్‌ తీసుకున్నారు.

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది.

Back to top button