Wednesday, March 11, 2026
Homeతెలంగాణమహేశ్వరంలో ప్రజా పాలన

మహేశ్వరంలో ప్రజా పాలన

•మహేశ్వరం, సిరిగిరి పురం గ్రామాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి

మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళ వారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి,కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తో కలిసి మహేశ్వరం మండలంలో మహేశ్వరం మరియు సిరిగిరి పూర్ గ్రామాలను సందర్శించారు. మొదట తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తాసిల్దార్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూరుస్తామని తెలిపారు, వెంటనే పనులను మొదలుపెట్టాలని సూచించారు. అలాగే మండల ఇన్చార్జ్ ఎంపీడీవో తో మాట్లాడి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని ఇండ్లను గృహప్రవేశాలను చేయించాలని దీన్ని హౌసింగ్ ఏఈ మరియు ఎంపీడీవో పర్యవేక్షించాలని తెలిపారు.ఉగాది లోపు పూర్తయిన ఇండ్లను నిర్దేశించిన లక్ష్యం ప్రకారం గృహప్రవేశాలు చేయించాలని ఎంపీడీవో ని ఆదేశించారు.ఆ తర్వాత సిరిగిరి పురంలో పాలిటెక్నిక్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు,సిరిగిరి పురం ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న చిన్నారులతో ముచ్చటించారు.

క్లాస్ రూమ్ లో ఉన్న స్మార్ట్ డిజిటల్ బోర్డ్ ట్యాబ్ లు ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నప్పటికీ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పకపోవడంతో పాఠశాల హెడ్మాస్టర్ మరియు అధ్యాపకులకు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులకు సరైన విద్యను అందించడం లేదని దీనిపై గ్రామపంచాయతీ సర్పంచ్ బాధ్యత తీసుకొని పర్యవేక్షించాలని సూచించారు. అంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎంపీడీవో మరియు పంచాయతీ సెక్రటరీలతో సిరిగిరి పురం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కేవలం పారిశుధ్యం ఒకటే కాదని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని దీనికి పై ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులు అంతా కలిసి వారి యొక్క ప్రణాళికారిపై ప్రగతి నివేదికలు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఇన్చార్జి ఎంపీడీవో తాసిల్దార్ కార్యాలయ డిటి నరేష్ గిరిధర్ రాజు మహేశ్వరం సిరిగిరి పురం పంచాయతీ సెక్రటరీలు సిరిగిరి పురం గ్రామపంచాయతీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments