ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

Psycho: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన మహిళ

Psycho: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకున్న ఓ దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Psycho: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకున్న ఓ దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, భర్త మృతదేహం పక్కనే రాత్రంతా ఒంటరిగా కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ గడిపినట్టు పోలీసులు గుర్తించడంతో ఈ కేసు మరింత విస్తృత చర్చకు దారితీసింది.

చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు (45), లక్ష్మీ మాధురి దంపతులు ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ సినిమా హాల్‌లో పనిచేస్తున్న మాధురికి తరచూ సినిమాలు చూడటానికి వచ్చే గోపీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.

గోపీ హైదరాబాద్‌లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుండగా, శివనాగరాజుకు డ్రైవింగ్ రావడంతో అతడినే డ్రైవర్‌గా నియమించాడు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని గోపీ, మాధురితో తన అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. విషయం శివనాగరాజుకు తెలియడంతో భార్యను తీసుకుని స్వగ్రామమైన చిలువూరుకు వచ్చి తన తండ్రి, మాజీ ఎంపీటీసీ లోకం గాంధీ వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే గ్రామానికి వచ్చిన తర్వాత కూడా మాధురి ప్రవర్తనలో మార్పు రాలేదు. గోపీతో ఫోన్ ద్వారా సంబంధాన్ని కొనసాగించింది. మరోసారి ఈ వ్యవహారంపై భర్త ప్రశ్నించడంతో, మాధురి ఎలాగైనా శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ప్రియుడు గోపీతో కలిసి పథకం రచించింది.

ఈ నెల 18న రాత్రి గోపీ ద్వారా నిద్ర మాత్రలు తెప్పించిన మాధురి.. వాటిని భోజనంలో కలిపి భర్తకు ఇచ్చింది. మాత్రల ప్రభావంతో శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం గోపీని ఇంటికి పిలిపించి ఇద్దరూ కలిసి శివనాగరాజు ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ మాధురి మాత్రం ఏమీ జరగనట్టు శవం పక్కనే కూర్చుని రాత్రంతా సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఈ ఘటనపై అనుమానం వచ్చిన మృతుడి తండ్రి లోకం గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో ఇది హత్యేనని నిర్ధారించారు. విచారణలో లక్ష్మీ మాధురి నేరాన్ని ఒప్పుకోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసును హత్యగా మార్చిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు గోపీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ALSO READ: Emotional Incident: ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button