మహేశ్వరం ప్రతినిధి ( క్రైమ్ మిర్రర్): మహేశ్వరం నియోజక వర్గం సర్దార్ నగర్ లో పేదలకోసం ఏర్పాటు చేసిన అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి లబ్ధి దారులకు అందేలా చేశారు.కానీ నిబంధనల ప్రకారం ఎక్కడ గాని ఇంటి స్థలం ,భూములు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నవారు.
మీసేవలో దరఖాస్తులు చేసుకోగా కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అలెర్ట్ అయ్యాయి.అలా వచ్చినవారికి ఇవ్వకుండా ఓ పార్టీకి చెందిన నాయకులే ఒక్కొక్కరు రెండు,మూడు ఇళ్లను తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు, సర్దార్ నగర్ లో గత 20సంవత్సరాలుగా స్థానికంగా ఉంటు రోజు వారి కూలీ చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని అవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నిరుపేదలకోసం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను బడా బడా నాయకులకు ఎలా ఇస్తారని స్థానిక బాధితులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా మరొక సారి సర్వే చేయించి నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని స్థానికుల డిమాండ్.





