
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- మహిళా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో భారత జట్టు ఓపెనర్ ప్రతీకా రావల్ తీవ్రంగా గాయపడ్డారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలు మెలికపడి తీవ్రమైన నొప్పితో మైదానాన్ని విడిచారు. అయితే ఇక ఆ తర్వాత జరగబోయేటువంటి మ్యాచ్లలో ప్రతీక రావల్ ఆడక పోవడంతో ఆ ప్లేస్ లోకి కీలక ప్లేయర్ ను తీసుకురానున్నారు. ఇంతకుముందు భారత జట్టుకు ఓపెనర్ గా రాణించిన యువ మహిళా క్రికెటర్ షఫాలి వర్మను జట్టులోకి తీసుకురానున్నారు. ఆస్ట్రేలియా తో ఈనెల 30వ తేదీన జరిగే సెమీఫైనల్ లో ఆమె జట్టులోకి చేరుతారని తాజాగా క్రీడ వర్గాలు పేర్కొన్నాయి. గాయం కారణంగా తోటి ఈ మహిళా వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా మిగతా అన్ని మ్యాచ్లకు ప్రతీక రావల్ దూరమయ్యారని వెల్లడించారు. అయితే ప్రతీకా రావల్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనపరచగా ఆమె లోటును షఫాలి వర్మ తీరుస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా సందేహంలో పడ్డారు. అయితే మరోవైపు షఫాలి వర్మా సహజంగానే దూకుడుగా ఆడే ప్లేయర్గా రికార్డులు కూడా ఉన్నాయి. దీంతో కొంతమంది ప్రతీకా రావల్ ప్లేస్ ను షఫాలి వర్మ భర్తీ చేయలేదని వాదిస్తుంటే… మరికొందరు మాత్రం షఫాలి వర్మ రాకతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది అని సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే బాట్స్మన్ అడుగు పెడతారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అనుకున్నట్టుగానే షఫాలి వర్మ మా జట్టులో భాగమైతే కచ్చితంగా తన దూకుడుతో ఇండియన్ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Read also : విజయ్ తో నిశ్చితార్థం నిజమేనా?.. రష్మీక సమాధానం ఇదే!
Read also : రేపే IND vs AUS మ్యాచ్.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు!





