Homeఅంతర్జాతీయంకేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు

  • ఏఐ ఇంపాక్ట్‌పై భిన్నాభిప్రాయాలు
  • అభినందించిన శశిథరూర్

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌పై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్న సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంశ‌లు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంత‌రాలు జరుగుతుంటాయని అయినాకూడ బాగానే నిర్వహించిందని మెచ్చుకున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఏఐ సమ్మిట్‌ను విమర్శించారు.‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన అని అభివ‌ర్ణించారు.

చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నార‌ని ఆరోపించారు. అలాగేకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లీఖార్జున్ ఖ‌ర్గే కూడా తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఫిబ్రవరి 17న జరిగిన శిఖరాగ్ర సమావేశాల ప్రారంభ రోజున పొడవైన క్యూలు, లాజిస్టికల్ సమస్యలు ఉన్నట్లు వార్త‌లు రాగా ఎలాంఇ సూచనలు లేకుండానే గేట్లు మూసివేశారని సందర్శకులు తెలిపారు.

అలాగే గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదానికి దారితీసింది. ‘ఓరియన‘ అనే రోబోటిక్ కుక్కపై విమర్శలు రావడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని ఖాళీ చేయమని కోరారు. ఇదిలా ఉంటే ఏఐ సమ్మిట్ నిర్వహణను రాహుల్ గాంధీ తప్పుప‌డితే శశిథరూర్ అభినందించారు.శిఖ‌రాగ్ర స‌మావేశానికి వెళ్లే అవ‌క‌శం రాక‌పోయిన శుక్ర‌వారం నేను ఈ విష‌యంపైమాట్లాడుతున్నారు.

మొద‌టి రెండు రోజులు బాగా గ‌డిచాయ‌ని, సంస్థా గ‌త లోపాలు ఉన్నాయ‌ని,పెద్ద కార్య‌క్ర‌మం కావున లోపాలు జ‌రుగుతాయ‌ని శ‌శిథ‌రూర్ వెనుకోసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై చర్చించారు. కేరళ ఎన్నికల వేళ ఇదో శుభపరిణామంగా భావించారు. మళ్లీ ఇంతలో ఏమైందో ఏమోగాని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించడంతో కాంగ్రెస్ పెద్ద‌ల‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

Most Popular

Recent Comments