ప్రపంచంలో అత్యంత పేద దేశాలు.. తిండిలేక ప్రజల అరిగోస!

0
192
Poorest Countries In The World 2025 By GDP Per Capita
Poorest Countries In The World 2025 By GDP Per Capita

World Poorest Counries: ప్రపంచంలోని పలు దేశాలు రోజు రోజుకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుండగా, మరికొన్ని దేశాలు పేదరికంలో కూరుకుపోతున్నాయి. కనీసం తినేందుకు తిండిలేక, కట్టుకునేందుకు బట్టలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలకు సంబంధించిన జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఈ లిస్టులో పేదరికంతో అరిగోసపడుతున్న దేశాల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్ ఏ దేశం దక్కించుకుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఉన్నాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

10లో 8 ఆఫ్రికా దేశాలే!

తాజాగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 10 అత్యంత పేద దేశాల్లో ఏకంగా 8 దేశాలు ఆఫ్రికాకు చెందినవే కావడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) సంస్థ ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన జీడీపీ, పీపీపీ ప్రకారం ఈ లిస్టును రూపొందించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. ఈ ర్యాంకులు తీవ్ర పేదరికంతో పోరాడుతున్న పలు దేశాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ లిస్టులో భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న మడగాస్కర్ టాప్ 10లో నిలిచింది. ఆర్థికంగా అవస్థలు పడుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ లిస్టులో లేకపోవడం విశేషం.

టాప్ 10 అత్యంత పేద దేశాలు ఇవే!

ఫోర్బ్స్ ఇండియా గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 నిరుపేద దేశాలు ఇవే!

1.సౌత్ సూడాన్

2.బురుండి

3.సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

4.యెమెన్

5.మొజాంబిక్

6.మలావి

  1. కాంగో

8.సోమాలియా

9.లైబీరియా

10.మడగాస్కర్

Read Also: టీచర్ తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు ఆగ్రహం!

ప్రపంచంలో అత్యంత తక్కువ జీడీపీ కలిగిన దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది. అత్యంత దురదృష్టకర దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశానికి 2011లో స్వాతంత్ర్యం వచ్చింది. తూర్పు ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో కేవలం 1.1 కోట్ల జనాభా ఉంది. మొత్తం జీడీపీ 29.99 బిలియన్ డాలర్లు(రూ.19 వేల కోట్లు) మాత్రమే. మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదేలా ఉన్నాయి.

Read Also: వాళ్లు హాస్పిటల్లోకి అడుగు పెట్టొద్దు, కేంద్రం సంచలన నిర్ణయం!