
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ న్యూస్ :- దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ పంచాయతీ నెలకొంది. బీజేపీ మరియు ఆప్ పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. నిన్న దీపావళి పండుగ కారణంగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించి 8 గంటల నుంచి రాత్రి 10:00 వరకు మాత్రమే టపాసులు కాల్చవచ్చని పర్మిషన్ ఇచ్చారు. దీపావళి పండుగ వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి సౌరవ్ భరద్వాజ తీవ్రంగా ఆరోపించారు. మరోవైపు ఆప్ అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ లో పంటలు కాల్చివేత వల్లనే ఈ రోజు ఢిల్లీలో ఈ పరిస్థితి ఏర్పడింది అని బీజేపీ పార్టీ ఆప్ పై ఎదురు దాడికి దిగింది. పొల్యూషన్ కు దీపావళి పండుగను అంట కట్టడం సరికాదని జవాబు ఇచ్చింది. గతంలో కూడా పొల్యూషన్ ఉంది.. కొత్తగా మా పార్టీ ఏమి పొల్యూషన్ తీసుకురాలేదు అంటూ బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.
Read also :ఢిల్లీలో గోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఎంపీ సంజయ్ సింగ్ స్క్రీన్ షాట్ విడుదల?
ఏది ఎలా ఉన్నా కూడా ఢిల్లీలో అయితే పొల్యూషన్ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. ఇవాళ ఉదయం చాణిక్య ప్లేసులో AQI ఏకంగా 979 గా, నరైన్ విలేజ్ లో 940గా నమోదవడంతో.. ఆరోగ్యంగా ఉన్న వారు కూడా శ్వాస తీసుకోలేకపోతున్నట్టు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎన్ 95, ఎన్ 99 మాస్కులు లాంటివి తప్పనిసరిగా ధరించాలని ఢిల్లీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read also : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా అంటూ మండిపడ్డ కేటీఆర్