
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- సైబర్ క్రైమ్ అధికారులు పేపర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న కొంతమంది తెలంగాణ మంత్రులు మరియు జర్నలిస్టుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అవడంతో వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు స్పందించి తగు జాగ్రత్తలను సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇబ్బంది పెట్టిన ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఈసారి నేరుగా ప్రముఖ వ్యక్తుల బయోడేటానే హ్యాక్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే సైబర్ క్రైమ్ అధికారులు ఎవరైనా సరే వాట్సాప్ లేదా ఇతర సైబర్ నేరాలకు గురవుతే వెంటనే 1930 కి కాల్ చేయాలని.. లేదా WWW.Whatsapp.com/contact లో తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకవేళ వాట్సప్ యాప్ హ్యాక్ గురైందని మీకు అనిపిస్తే వెంటనే యాప్ అన్ ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. వీటితో పాటుగా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి అని తెలిపారు. ఇక ఫోన్ పదేపదే ఓవర్ హీట్ అలాగే బ్యాటరీ త్వరగా డిస్చార్జ్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి అని.. తద్వారా వెంటనే ఫోన్ రీసెట్ చేయాలి అని కోరారు. ఒకవేళ సైబర్ క్రైమ్ అధికారులు చెప్పినట్లు చేయకపోతే కచ్చితంగా మీ డేటా అనేది వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. వాట్సప్ యాప్ లోని వివిధ గ్రూపుల్లో వచ్చేటువంటి ఏపీకె ఫైల్స్ ని ఎవరు కూడా ఓపెన్ చేయవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హ్యాకర్లు ఈ వాట్సప్ గ్రూపులలో ఫేక్ ఏపీకే ఫైల్స్ ను సెండ్ చేస్తున్నారు అని కనుక వాటిని ఎవరు కూడా ఓపెన్ చేయవద్దని సూచించారు.
Read also : హైదరాబాదులో ఘోర ప్రమాదం.. బెంబేలిస్తున్న అస్తిపంజర ఫోటోలు!
Read also : టికెట్లు అయిపోయే.. ప్రైవేట్ బస్సులకు పండుగే!





