తెలంగాణ

ప్రశ్నిస్తున్న క్రైమ్ మిర్రర్ పై పగ పెంచుకుంటున్న పోలీస్ అధికారులు..!?

  • దొరికిన కేసుల్లో ఇరికించే ప్రయత్నం, రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసే ఆలోచనలు..!?
  • ఇప్పటికే ఆయా చోట్ల క్రైమ్ మిర్రర్ విలేకరులపై జరుగుతున్న సీక్రెట్ ఎంక్వైరీ..!?
  • మన సీక్రెట్స్ ఎలా లీక్ అవుతున్నాయన్న కోణంలో వెరిఫికేషన్..!?
  • వరుస కధనాలపై విచారణ చెయ్యకుండా, రిపోర్టర్ ల పై పగ సాధింపు చర్యలు..!?
  • వస్తున్న కధనాలపై ఇప్పటి వరకు జరగని విచారణ చర్యలు…!?
  • క్రైమ్ మిర్రర్ ప్రతినిధులకు ఏమి జరిగినా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధ్యతే..!?

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన వారధిగా పని చేస్తున్న పత్రికా స్వేచ్చను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు నల్లగొండ పోలీసులు..!? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న ఎస్బి, టాస్క్ ఫోర్స్ అధికారులపై సమగ్ర కధనాలు రాస్తున్న క్రైమ్ మిర్రర్ పత్రికపై పీకలలోతు పగ పెంచుకున్న జిల్లా అధికారులు, క్రైమ్ మిర్రర్ ప్రతినిధులను టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో బుక్ చెయ్యాలని పదురుకున్నట్లు సమాచారం..!? తమ సీక్రెట్స్ బయటికి ఎలా వెళ్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ, ఇప్పటికే విలేకరుల ఫోన్ ట్యాప్ చేసే ప్రక్రియలో పోలీస్ యంత్రాంగం ఉందని వినికిడి..!? జరుగుతున్న అక్రమాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యటమే క్రైమ్ మిర్రర్ చేస్తున్న తప్పా..!? అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న అధికారులను వదిలేసి, తప్పును వేలెత్తి చూపుతున్న రిపోర్టర్ లపై పండ్లు కొరకడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.

జిల్లా ప్రజలు..!? డబుల్ ధమాకాలో అవినీతి చేసిన వారిపై గతంలో వరుస కధనాలు రాసినప్పటికి, వారిపై ఇంత వరకు విచారణ, చర్యలు తీసుకోకపోవటం గమనార్హం..!? డబల్ దమాకా కేసులో సీజ్ చేసిన కార్లు, విలువైన ఫర్నిచర్, బంగారు ఆభరణాల జాడ లేదన్న కథనాలతో 18 తులాల బంగారాన్ని సదరు వ్యక్తికి అప్పటి ఎస్పీ కి తెలియకుండా ఇచ్చారని పుకారు..!? కానీ ఇప్పటి వరకు పట్టుకొచ్చిన కార్ల ఊసే లేదని, రికవరీ కూడా చేసింది కొండంత, చూపింది గోరంత అనే ప్రచారం ఉండగా, లక్షల విలువైన ఫర్నిచర్ మొదట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో, ప్రస్తుతం ఓ టాస్క్ ఫోర్స్ అధికారి ఇంట్లో ఉన్నాయని వినికిడి..!? వస్తున్న కధనాలలో ఆరోపణలు ఎదురుకొంటున్న వారిని విచారణ చేస్తే అసలు కత ఏంటనేది తెలుస్తున్నప్పుడు, ప్రతినిధుల జాడలు వెతకటం వెనుక ఆంతర్యం ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది..!?

ఎన్నో ఏండ్ల నుండి ఒకే శాఖలో పనిచేస్తు, ఎన్నో రహస్యాలతో పాటు, గల్లీ దందాల జాడ తెలుసుకొని, మంత్లీలు తీసుకుంటున్న వారిపై ఉన్నత అధికారులకు ఎందుకంత ప్రేమని జిల్లా ప్రజలు అంటున్నారు..!? ఎస్బి, టాస్క్ ఫోర్స్ లో ఉన్న కొంతమందిని మార్చడం వల్ల నల్లగొండ సస్యశ్యామలం అవుతుందని అనుభవజ్ఞ్యులు అంటున్నారు..!? అవి వదిలేసి రిపోర్టర్ లను టార్గెట్ చేస్తే వచ్చేది ఏమిటని, కావాలని పత్రిక స్వేచ్చకు అడ్డుపడుతూ, నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యటం సరికాదని స్థానికులు అంటున్నారు..!? క్రైమ్ మిర్రర్ పత్రికా ప్రతినిధులపై కక్షపూరిత చర్యలు, మరేరకమైన సాహసాలకు పాల్పడితే జిల్లా ఎస్పినే బాధ్యత వహించాలని తెలుపుతున్నాము.. అవినీతి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకు వరుస కధనాలు ప్రచురిస్తూనే ఉంటాము..

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

మరో కొత్త అంశంతో మీ ముందుకు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button