క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి కాకుండా, ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయన మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతేడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదు అయితే 2025లో 1,67,018 కేసులు నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 2.33 శాతం తగ్గినట్లు వెల్లడించారు.

మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు మరియు కేసుల సత్వర పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్ బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు, నిరంతర నిఘా వల్లనే నేరాల సంఖ్య తగ్గిందని నివేదిక పేర్కొంది.
తెలంగాణలో ఈ ఏడాది 509 మంది నక్సల్స్ లొంగిపోయారని.. వారిలో 481 మంది ఛత్తీస్‌గఢ్, 21 మంది తెలంగాణ, ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ నక్సల్స్ ఉన్నారని తెలిపారు. నాలుగు నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించమన్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు.

డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారని డీజీపీ వెల్లడించారు.జార్ఖండ్ లో నిర్వహించిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులు 18 పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణ పోలీసులు 10 పతకాలు సాధించారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
నయీమ్ భూములు కొనద్దు
ప్రైవేటు సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశామని.. పోష్ యాక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఇందులో 18 నుంచి 35 ఏళ్ళు లోపు ఉన్న వారు హాజరువుతారని తెలిపారు. టీజీ ఆర్టీసీ డ్రైవర్లను ఈ ఏడాది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా పరీక్ష నిర్వహించామన్నారు.

నయీమ్ కేసు సీఐడీ విచారణలో ఉందన్నారు. నయీమ్ కేసులో సీజ్ అయిన ల్యాండ్స్, చాలా మంది అమ్మాలని ప్రయత్నం చేశారని తెలిపారు. నయీమ్ లాండ్స్‌పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ల్యాండ్ ఎవరూ కొనవద్దని, అమ్మవద్దని ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.





