Homeతెలంగాణప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మునుగోడు,క్రైమ్ మిర్రర్ : ప్రజావాణి పిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మునుగోడులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించి,భవన నిర్మాణ పనులను తక్షణమే మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈడబ్ల్యు ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు వెళ్ళే రహదారి,పరిసర ప్రాంతాలను పరిశీలించారు.bగురువారం ఆమె మునుగోడు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులు, భూములకు సంబంధించిన సమస్యలు, దరఖాస్తుల పరిష్కారం, తదితర వివరాలను తహసిల్దార్ నరేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలానికి సంబంధించిన అడ్వాన్స్ పొజిషన్ వివరాలను జిల్లా కలెక్టర్ చండూర్ ఆర్డీవో శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read also :సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలి : MLA కోమటిరెడ్డి

Read also : అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు.. సీరియస్ అయిన సీఎం?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments