తెలంగాణ

Apk ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

కోదాడ, క్రైమ్ మిర్రర్:- Apk అని ఉండే ఏ ఫైల్స్ ని కూడా ఎటువంటి పరిస్థుతులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా పోవడమే కాకుండా మీకు తెలియకుండా మీ ఫోన్ ను సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారు. మీ ఫోన్లో ఉన్న డాటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలించబడతాయి అని dsp శ్రీధర్ రెడ్డి జాగ్రత్తలు తెలిపారు.

ఉదాహరణకు:-
RTO CHALLAN.apk
Aadhar.Apk
SBI.Apk
pm kisan.Apk
Unions Bank.Apk
Cse.Apk
Statebank.Apk
Ekyc apk

ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది.
ఈ ఫైళ్లని డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా డిలీట్ చేయండి. ఒకవేళ పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే తక్షణం చేయాల్సిన చర్యలు

1.పొరపాటుగా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
2. ⁠మొదట ఇంటర్ నెట్ డేటా ఆఫ్ చేసి, సెట్టింగ్స్ లోని యాప్స్ లోకి వెళ్లి సదరు ఏపీకే యాప్ని అన్ ఇన్స్టాల్ చేయాలి. యాంటీ వైరస్ యాప్తో ఫోన్ని ఫుల్స్కాన్ చేయాలి.
3. ⁠బ్యాంకింగ్ యాప్లు, సామాజిక మాధ్యమాల ఎకౌంట్లు, ఈ- మెయిల్ ఎకౌంట్ పాస్వర్డులు వెంటనే మార్చాలి.
4. ⁠మెసేజ్లు, కాలాగ్, బ్యాంకు లావాదేవీలు, ఈ-మెయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో పరిశీలించాలి. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే, ఫోన్ని సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి.
5. ⁠ఫోన్లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది. ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతా స్తంభింపజేయాలి.
6. ⁠1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

Read also : అమరేశ్వర సన్నిధిలో అయ్యప్ప మాలధారణ..!

Read also : మరోసారి ఊపందుకున్న డేటింగ్ ప్రచారం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button