Homeతెలంగాణస్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్ ఏర్పాటు చేశాలి : మాజీ జెడ్పీటీసీ

స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్ ఏర్పాటు చేశాలి : మాజీ జెడ్పీటీసీ

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం శనివారం రోజు ఆత్మకూరు(ఎం) మాజీ జడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో వారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు చాలా వరకు బీద పరిస్థితిలో వున్నారు. ఐదు సంవత్సరాలు పాలకులుగా పరిపాలన సాగించి గ్రామాల అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కృషి చేసి పదవి విరమణ తర్వాత కూడ వారి ప్రాంతం అభివృద్ధికే కృషిచేస్తున్నారు. ఎక్కువ శాతం బీద పరిస్థితిలో వున్నారు.స్థానిక సంస్థలలో సర్పంచ్,ఎంపిటీసి, జెడ్పీటీసీ,మండల పరిషత్ అధ్యక్షులు,జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసారు.జిల్లా పరిషత్ అధ్యక్షులకు స్టేట్ మినిష్టర్ క్యాడర్ వున్నప్పటికి పెన్షన్ లేదు కావున స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఫ్రతికంఠం హేమలత రాజు,మాజీ సర్పంచ్లు ఎరుకల స్వామి గౌడ్,బి లక్ష్మమ్మ,జోగు పిచ్చమ్మ,యాస బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Corporator Deeplanayak: అనునిత్యం ప్రజల్లో ఉంటా.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తా: దీప్లా నాయక్

iPhone 18 Pro new: ఐఫోన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments