తెలంగాణ

పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పరిష్కరించాలి

పెబ్బేరు, క్రైమ్ మిర్రర్ :- పెబ్బేరు నుంచి వనపర్తికి పోయే బీటీ రోడ్డు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, కరెంట్ ఫోల్స్ షిఫ్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ మేనేజర్ గణేష్ బాబు కు వినతిపత్రం అందజేశారు. దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. విలేఖరుల కాలనీ నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు దాకా ఉన్న 6.30 ఎకరాల్లోని పీజేపీ కెనాల్ పక్కన గల స్థలంలో వెంటనే ప్లాట్లు చేసి రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కర్ణ శ్రీ మాట్లాడుతూ పెబ్బేరు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి శ్రీ వేణుగోపాలస్వామి గుడి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అమృత్ 2.ఓ లో ఆగిపోయిన అన్ని పనులను వెంటనే ప్రారంభించి మంచినీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

Read also : ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ.. వనపర్తి మునిసిపాలిటీకి రూ.18.70 కోట్ల యూఐడిఫ్ నిధులు!

ఆగిపోయిన మున్సిపల్ వాటర్ ఫిల్టర్లను రిపేరు చేసి సత్వరమే వాడుకలోకి తీసుకురావాలనీ ఆమె అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రె స్వామి మాట్లాడుతూ పీహెచ్సీ దగ్గర గల మున్సిపల్ స్థలంలో రూ.60 లక్షల వ్యయంతో షాపింగ్ కాంప్లక్స్ వద్ద షాపులు టెండరు పూర్తయింది.కాని అగ్రిమెంటు చేయడం లేదు. అది పూర్తి చేస్తే షాపులు వచ్చిన వారు వాటిని తెరుచుకొని వ్యాపారాలు కొనసాగిస్తారు.అదేవిధంగా రూ.40లక్షల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు స్థలం నిధులు కేటాయించడం జరిగింది. వాటికి టెండటర్లు పూర్తయి అగ్రిమెంటు అయినా కూడా నిర్మాణం చేయడం లేదని అన్నారు.సుంకులమ్మ గుడి వద్ద కల్వర్టు మరియు బీటీ రోడ్డుకు కూడా నిధులు ఉండి కూడా టెండర్లకు పిలవడం లేదు. 64 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి పేదలకు పట్టాలు ఇచ్చారు. కాని అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
10.15వ ఫైనాన్స్, జనరల్ ఫండ్, టీయుఎస్ఎఫ్యు నిధులతో పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు టెండర్లు పూర్తయినా వర్క్ స్టార్ట్ చేయడం లేదని అన్నారు ఆగిపోయిన మున్సిపల్ వాహనాలకు వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో.మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు. వనం రాములు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి. బి ఆర్ ఎస్ నాయకులు. వెంకటేష్. రమేష్. వేణు. సహదేవుడు. బీచుపల్లి. బసవరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read also : భార్య కాపురానికి రావడం లేదని పెట్రోల్ పోసుకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button