
కోదాడ,క్రైమ్ మిర్రర్:- ఈనెల 28 ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించిన కోదాడ నియోజకవర్గం, కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండ పాలెం కి చెందిన పెదపంగు అభినయ్ తన చాకచక్యంతో జట్టులో కీలక పాత్ర పోషించారు. రానున్న రోజుల్లో మరింత రాణిస్తానని,గ్రామానికి కోదాడ నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తెస్తానని అభినయ్ తెలిపారు. తనతోపాటు జట్టులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు సమిష్టిగా రాణించడంతో విజయం సాధించామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి దేశానికి ఆడాలన్నదే తన కల అని అభినవ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు, అనేక విజయాలు సాధించి సూర్యాపేట జిల్లాకు పేరు ప్రతిష్టలు తెస్తామని ఆయన తెలిపారు. జట్టులో కీలక పాత్ర పోషించిన అభినయ్ ను గ్రామంలోని పెద్దలు, విద్యావంతులు, వారి బంధువులు అభినందించారు. సామాన్య కుటుంబంలో పుట్టి జిల్లా జట్టులో చోటు సంపాదించుకుని, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభినయ్ ను అభినందించినారు. సమాజంలో నేటి యువత, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుతోపాటు, క్రీడల్లో రాణించాలన్నారు. అభినయ్ ను గ్రామంలోని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
Read also : యూట్యూబర్ నా అన్వేషణకు బిగ్ షాక్.. అన్ ఫాలో అయిన లక్షల ఫాలోవర్లు?
Read also : మర్రిగూడ మండలంలో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు..





