
-మండల అధ్యక్షుడు ఎస్ హర్షవర్ధన్
-యువజన అధ్యక్షుడు సురేష్
పెబ్బేరు, క్రైమ్ మిర్రర్:- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ఆదర్శ కాలనీలో శాలివాహన కుమ్మర కమ్యూనిటీ హాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు జయంతు రావు పిలుపుమేరకు వనపర్తి జిల్లా శాలివాహన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మండల కమిటీ మరియు యువజన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతన శాలివాహన మండల అధ్యక్షునిగా. సూర్యవంశం హర్షవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి కృష్ణ, కోశాధికారిగా బొడ్డుపల్లి వెంకటేష్, యువజన కమిటీ అధ్యక్షునిగా సూర్యవంశం సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఏనికిచెర్ల శ్రీను, కోశాధికారిగా సూర్యవంశం రఘు,ప్రచార కార్యదర్శులుగా సూర్యవంశం తేజ, సూర్యవంశం వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడు మాట్లాడుతూ… కుమ్మర శాలివాహనులు తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నారు. మనమందరం ఐకతగా ఉండి ఏకతాటిగా ముందుకు వచ్చి ప్రతి గ్రామాలలో సంఘాలు ఏర్పాటు చేసుకొని మనమందరం ఒక ఐక్యతగా ఉండి జిల్లాల్లో కమిటీలు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మన ఐక్యతను చాటుదామని తెలిపారు. శాలివానులను బీసీ బీ నుండి బీసీఏలో కలిపేవరకు మన పోరాటం చేద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో. వనపర్తి జిల్లా శాలివాహన కమిటీ సభ్యులు ఎస్ నరసింహ, బి పరుశరాముడు, బి వెంకటేశ్వర్లు,ఎస్ రాముడు, పెబ్బేరు టౌన్ కమిటీ అధ్యక్షుడు ఎస్ నాగన్న, ఎస్ శ్రీనివాసులు, కె పరు శరాముడు, కె శ్రీనివాసులు, కె.పరశురాముడు,కె .బాలరాజు,జి రాముడు, వెంకటేష్, మహేష్, రాముడు, రాజు, దశరథ,కర్ణకర్, శివ, వెంకటయ్య,కుమ్మర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Read also : మీ సేవ.. జస్ట్ Hi అని పంపిస్తే చాలు.. ఏ పనైనా చిటికలో అయిపోతుంది!
Read also : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటి తల్లి మృతి!





