ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

మిర్యాలగూడ టూ ఆంధ్రకు పిడిఎస్ బియ్యం మాఫియా..!

నల్లగొండ నిఘా క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా బియ్యం సప్లై చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. కానీ కొంతమంది బడా రేషన్ వ్యాపారులు కేజీ 10 నుండి 14 రూపాయల వరకు ప్రజల నుండి కొనుగోలు చేస్తూ భార్డర్ దాటిస్తున్నారు. ప్రజల నుండి రూపాయలలో కొని వ్యాపారులు మాత్రం లక్షలు సంపాదిస్తున్నారు.

ఈ వ్యాపారాల జోలికి రాకుండా ఆయా చోట్ల కొంతమంది అధికారుల హస్తం ఉండటం, అది బయటపడి పై అధికారులు చర్యలు తీసుకోవటం ఆనవాయితని గట్టి ప్రచారం. ఇది ఇలా ఉండగా మిర్యాలగూడ నుండి ఆంధ్రకు దాదాపు 40 క్వింటాల్ల ప్రభుత్వ బియ్యాని తరలిస్తున్న అశోక్ లీలాండ్ వాహనం శుక్రవారం బోల్తా పడిందని సమాచారం. ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి అదుపుతప్పిన అశోక్ లీలాండ్ బోల్తా పడిందని, అధికారులు వాటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాహనం నడుపుతున్న డ్రైవర్ మృతి చెందినట్లు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ పిడిఎస్ బియ్యాన్ని మిర్యాలగూడ నుంచి దామెరచర్ల మీదుగా ఆంధ్రకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని వెనుక అండగా ఉన్న వారి ఉనికిని కనిపెట్టే విధంగా జిల్లా పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నట్లు ప్రచారం. గాయాలుపాలైన వారిని పోలీసులు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దందా వెనుక ఎవరున్నారు అనే అంశాలపై జిల్లా వ్యాప్తంగా అనేక పుకార్లు వస్తున్నాయి. కొంతమంది మంచి హోదా కలిగిన అధికారులే వెన్నంటే ఉండి నడిపిస్తున్నట్లు అనుకుంటున్నారు. నిఘా పెట్టాల్సిన వ్యవస్థ కాసింత మొహమాటానికి, వెనకడుగు వేస్తూ వ్యవస్థను గాలికి వదిలేసారని, దళారులతో కుమ్మకై గట్టిగా దండుకుంటున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి…!? మాజీ అధికారిని అడుగు జాడల్లోనే ప్రస్తుతం ఒక పెద్ద అధికారి, మిర్యాలగూడలోని మరో ఇద్దరు అధికారుల కనుసన్నలలోనే ఈ దందా నడుస్తుందని పుకారు…!?

ఈ దందా వెనుకుండి నడిపిస్తున్న అధికారులపై, ఈ దందా చేస్తున్న వ్యాపారులపై మరో క్రైమ్ మిర్రర్ కధనంతో మీ ముందుకు.

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button