క్రైమ్

పాశంమైలారంలో శవాల గుట్టలు.. 50కి చేరిన మృతులు!

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. పేలుడు జరిగిన ప్రాంతం శవాల గుట్టలుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసిన శరీర మాంసం ముద్దలు.. తెగిపడిన తలలు.. విరిగిపడిన కాళ్లు, చేతులే కనిపిస్తున్నాయి. పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాలు తొలగిస్తున్న కొద్ది శవాలు బయటికి వస్తున్నాయి. మృతుల సంఖ్య 50 దాటిందని చెబుతున్నారు.

ఇప్పటి వరకు 26 మృతదేహాలను వెలికితీశారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య తెలిపారు. మరో 27 మంది ఆచూకి తెలియరాలేదన్నారు. 35 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 57 మంది సురక్షితంగా ఇంచికి వెళ్లారని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ప్రమాద సమయంలో మూడు అంతస్తుల బిల్డింగ్‌ కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు ఉన్నారు. వీరికోసం సహాయకచర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యల్లో SDRF, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయకచర్యలను సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పర్యావేక్షిస్తున్నారు.

మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్‌బీమ్‌లు సైతం విరిగి, కుప్ప కూలిపోవడంతో నష్టతీవ్రత పెరిగింది. పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇలంగోవన్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్రం మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button