Homeజాతీయంపండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేస్తాడా..ఆరోగ్యంపై డాక్టర్ల కీలక అప్డేట్!

పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేస్తాడా..ఆరోగ్యంపై డాక్టర్ల కీలక అప్డేట్!

క్రైమ్ మిర్రర్, జాతీయం :- ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొనగా, వైద్యులు తాజా వివరాలు వెల్లడించారు.

‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్, పలు టీవీ షోలు, సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఓ ఈవెంట్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు.సమాచారం ప్రకారం, కారు వెనుక భాగంలో నిలబడి ఉన్న పండును వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలేరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ మీడియాతో మాట్లాడారు. రాత్రి రెండు గంటల సమయంలో పండును ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. పరిశీలనలో ఎడమ తుంటి కీలు జారిపోయిందని, అలాగే మోకాళ్ల కింద రెండు కాళ్లలో ఎముకలు విరిగిపోయినట్లు గుర్తించామని చెప్పారు.వెంటనే తుంటి ఎముకకు శస్త్రచికిత్స నిర్వహించి సరిచేశామని, ప్రస్తుతం రెండు కాళ్లకు కూడా ఆపరేషన్లు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. అయితే ప్రాణాపాయం లేదని, శరీరంలోని ఇతర భాగాలకు ఎలాంటి ప్రమాదకర గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
అభిమానులకు ఊరటనిచ్చే విషయమేమిటంటే.. పండు మాస్టర్ పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అయితే రికవరీకి కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చని చెప్పారు. చికిత్స, ఫిజియోథెరపీ పూర్తి అయిన తర్వాత మళ్లీ సాధారణ జీవితానికి తిరిగి రావడంతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కూడా ఉందని వైద్యులు వెల్లడించారు.ఈ వార్తతో పండు మాస్టర్ అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. సోషల్ మీడియాలో పలువురు టీవీ సెలబ్రిటీలు, సహచర కళాకారులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం పండు మాస్టర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు