
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 11వ తేదీన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. 11వ తేదీ తొలి విడత ఎన్నికల కారణంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు కూడా వైన్స్, రెస్టారెంట్లు మరియు బార్లు అన్నీ కూడా మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు. ఎవరైనా సరే రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ వరకు కూడా అధికారుల ఆదేశాలను పాటించకుండా వైన్స్ లేదా బార్లు ఓపెన్ చేసి సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అని అధికారులు హెచ్చరికలు చేశారు. కాబట్టి ఎవరూ కూడా అధికారుల ఆంక్షలును ఉల్లంగించకండి అని సమాచారాన్ని అన్ని గ్రామాల్లో తెలియజేస్తున్నారు. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11వ తేదీన దాదాపు 4236 స్థానాల్లో జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులుగా ఉన్నటువంటి వారు ప్రచారాలలో దూసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలలో నాయకులతో పాటు ప్రజలు కూడా ఉత్సాహంగా ఉంటూ ఎవరు గెలుస్తారా అని ఆలోచించే పనిలోనే నిమగ్నమైపోయారు.
Read also : Facts: పెరుగు తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..
read also : Facts: పెరుగు తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..





