
మునుగోడు, క్రైమ్ మిర్రర్ : కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సేవలు మరువలేనివి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మగ్దుంబవన్ లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని మునుగోడు మండల నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నల్లగొండ ఎంపీ గా రెండు దశాబ్దాలు గా అబివృద్ధి చేశారని అన్నారు. ప్రతిరోజు నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని గుర్తుకు తెచ్చారు. దేశంలో రాజకీయ పునాదులు వేశారని, మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమం లో అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి,పాల్వాయి వెంకట్ రెడ్డి, లింగస్వామి,మల్లేష్ యాదవ్ శ్యామ్ రమేష్ విజయ్ నాగేష్ పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సురవరం కు నివాళలు అర్పించారు. సురవరం కళ్ళు, భౌతిక కాయం వేరు వేరు ఆసుపత్రులకు డొనేట్ చేశారు.
Read also : వినాయక చవితి పండుగ వేల డీమార్ట్ లో భారీ ఆఫర్లు!
Read also : రష్యాపై ఉక్రెయిన్, యెమెన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు