క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- లేడీ యాక్టర్ గా టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో భార్యాభర్తలు సరైన భవిష్యత్ ప్లాన్ చేసుకోకుండా పిల్లలను కంటూ తప్పు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ప్లాన్ చేసుకుని.. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరంగా ఉంటూ పిల్లలను పోషించగలము అని నిర్ణయించుకున్న తర్వాతే పిల్లలను కనాలి అని సూచించారు. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సరైన ప్లానింగ్ చేసుకోకుండానే పిల్లలను కని నానా ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటివి నేను ప్రతిరోజు కూడా చాలా చూస్తున్నాను అని తెలిపారు. అయితే బిడ్డలను కనడానికి నేను వ్యతిరేకం కాదు కానీ భవిష్యత్తులో మీ బంధువులు లేదా మిత్రులు ఎవరూ కూడా ఇటువంటి విషయాల్లో ఆర్థికంగా సహాయం చేయరు అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అని సూచించారు.
బస్తర్లో మళ్లీ పేలిన తూటా…!మావోయిస్టులకు ఎదురు దెబ్బ
Hormuz Tension: కల్లోల హోర్ముజ్ జలసంధి దాటి ముంబైకి చేరిన భారీ చమురు నౌక.. ఎలా వచ్చిందంటే?
