
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఒంగోలు నగరంలో ఎస్పీ దామోదర్ వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు నగరం అంతటా కూడా ఏకంగా 35 డ్రోన్ల కెమెరాలుతో నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. కాగా నగరంలో హత్యలు అలాగే అసాంఘిక కార్యకలాపాలు, రాత్రి అయితే చాలు బర్త్డే పార్టీలంటూ రోడ్లమీద విచ్చలవిడిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా యువకులు, బహిరంగంగా మద్యం తాగే ప్రాంతాలు, పేకాట స్థావరాలపై పోలీసులు పూర్తిగా నిగా పెట్టారు. ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఒంగోలు నగరం మొత్తం పై ఉదయం, పగలు అలాగే రాత్రుళ్ళు అనే తేడా లేకుండా నిత్యం పోలీసులు డ్రోన్లతో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా పోలీసులు నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే వెంటనే అక్కడికి పోలీసులు డ్రోన్ ల ద్వారా అసలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుంటున్నారు. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో ఎవరూ కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసులు మీ దగ్గరకు చేరుకుంటారు. కాబట్టి మిమ్మల్ని ఎవరూ చూడట్లేదని పొరపాటు పడితే మాత్రం వెంటనే దొరికిపోతారు. కావున ఎవరూ చూడట్లేదని ఏ తప్పు కూడా చేయకండి. అలా తప్పు చేస్తే మాత్రం డ్రోన్ల రూపంలో మీరు చాలా సులభంగా దొరికిపోవడం లో ఎటువంటి ఈ సందేహం లేదు. కాబట్టి నిత్యం పోలీసులు డ్రోన్ల సహాయంతో ఒంగోలు నగరం అంతటా కూడా ఏకంగా 35 డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నగరంలోని వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్పి దామోదర్ హెచ్చరించారు.