Homeక్రైమ్అమావాస్య వేళ.. ఖననం చేసిన మృతదేహం తల మాయం!

అమావాస్య వేళ.. ఖననం చేసిన మృతదేహం తల మాయం!

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏడాది క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వెలికి తీసి తల భాగాన్ని అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గ్రామస్తుల్లో భయాందోళనలకు కారణమవుతోంది.

ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్ (19) గత సంవత్సరం నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. యువకుడి అకాల మరణంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు సంప్రదాయాల ప్రకారం వెంకట్ మృతదేహానికి తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆ మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని తవ్వి వెలికి తీశారని తెలుస్తోంది. అక్కడ గుంత తీసిన ఆనవాళ్లు కనిపించడంతో మృతుడి సోదరుడు దీపక్ మంగళవారం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహంలో తల భాగం కనిపించకపోవడంతో అది అపహరించబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఆదివారం పుష్య అమావాస్య కావడంతో, మూఢనమ్మకాల నేపథ్యంలో తల భాగాన్ని తీసుకెళ్లి ఉండవచ్చనే చర్చ గ్రామంలో సాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు భయంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయమై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో బండారి రాజును వివరణ కోరగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల వివరాలను గుర్తించేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ALSO READ: Heart Attack: లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ప్రాణాలకే ముప్పు!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు